Monday, April 29, 2024

ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆతిథ్య భారత్ 50 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో మలేసియా విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో భారత్‌తో మలేసియా తలపడుతుంది. మూడో స్థానం కోసం జపాన్‌దక్షిణ కొరియా జట్లు తలపడుతాయి. ఇక జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేసింది. ఆట 19వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. అద్భుత ఆటను కనబరిచిన ఆకాశ్‌దీప్ కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్ సాధించాడు. కొద్ది సేపటికే పెనాల్టీ కార్నర్ నిపుణుడు హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు రెండో గోల్ సాధించి పెట్టాడు.

23వ నిమిషంలో ఈ గోల్ లభించింది. ఇక ప్రథమార్ధం చివరి నిమిషంలో మణ్‌దీప్ సింగ్ భారత్‌కు మూడో అందించాడు. మణ్‌దీప్ కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్‌ను సాధించాడు. దీంతో తొలి హాఫ్‌లో భారత్ 30 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా టీమిండియా దూకుడుగా ఆడింది. జపాన్ ఈసారి కూడా గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. 39వ నిమిషంలో సుమిత్ అద్భుత ఫీల్డ్ గోల్ సాధించాడు. ఇక 51వ నిమిషంలో సెల్వం కార్తీ భారత్‌కు ఐదో గోల్ అందించాడు. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీస్‌లో 62 గోల్స్ తేడాతో కొరియాను ఓడించింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన మలేసియా అలవోక విజయంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇక పాకిస్థాన్ వర్ణీకరణ మ్యాచ్‌లో చైనాను ఓడించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News