Thursday, November 7, 2024

ఉప్పల్ లో భారత్ ఊచకోత.. చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మూడో చివరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. సంజూ శాంసన్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 111 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు బాది 75 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 34 పరుగులు, హార్దిక్ పాండ్య 47 పరుగులు చేశారు. వచ్చిన వారు వచ్చినట్లు ధనాధన్ బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3, టస్కిన్, ముస్తఫిజుర్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో హిర్దోయ్ (63), లిటన్ దాస్ (42)లు చేశారు. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, మయాంక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మూడు టీ20ల సిరీస్ ను 3-0తో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News