Tuesday, December 10, 2024

యుఎస్ టాప్ ఆరోగ్య సంస్థ చీఫ్‌గా భారతీయ అమెరికన్ జయ్ భట్టాచార్య

- Advertisement -
- Advertisement -

అమెరికాలో అగ్ర శ్రేణి ఆరోగ్య పరిశోధన. ఆర్థిక సంస్థల డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ సైంటిస్ట్ జయ్ భట్టాచార్యను అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. దీనితో భట్టాచార్య అగ్రశ్రేణి పరిపాలన పదవికి ట్రంప్ నామినేట్ చేసిన తొలి భారతీయ అమెరికన్ అయ్యారు. ఇంతకుముందు ట్రంప్ భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని కొత్తగా సృష్టించిన ప్రభుత్వ సామర్థ విభాగం (డిజిఇ)కి సారథ్యం వహించేందుకు టెస్లా యజమాని ఎలాన్ మస్క్‌తో పాటు ఎంపిక చేశారు. అయితే, అది వాలంటరీ హోదా. యుఎస్ సెనేట్ నుంచి ధ్రువీకరణ పొందవలసిన అవసరం లేదు.

‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా సేవ చేసేందుకు జయ్ భట్టాచార్యను నామినేట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. డాక్టర్ భట్టాచార్య జాతీయ వైద్య పరిశోధనకు మార్గదర్శకత్వం వహించేందుకు, ఆరోగ్యాన్ని మెరుగునపరిచే, ప్రాణాలు కాపాడే ముఖ్యమైన శోధనలు చేసేందుకు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ సహకారంతో కృషి చేస్తారు’ అని ట్రంప్ ప్రకటించారు. భట్టాచార్య స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసర్చ్‌లో రీసర్చ్ అసోసియేట్, స్టాన్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ పాలసీ రీసర్చ్, స్టాన్‌ఫర్డ్ ఫ్రీమాన్ స్పోగ్లి ఇన్‌స్టిట్యూట్, హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో మర్యాదపూర్వకంగా సీనియర్ ఫెలో అని ట్రంప్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News