Wednesday, July 2, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్ బోపన్న

- Advertisement -
- Advertisement -

భారత టెన్నిస్‌ వెటరన్‌ రోహన్‌ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడేశానని.. ఇకపై తాను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఆడబోనని వెల్లడించారు. ఆదివారం పారిస్ ఒలింపిక్స్‌ పురుషుల డబుల్స్ ఈవెంట్స్‌ ఓపెనింగ్ రౌండ్‌లోనే బోపన్న-బాలాజీ జోడీ ఓడిన విషయం తెలిసిందే.

కాగా బెంగళూరుకు చెందిన బోపన్న అత్యంత పెద్ద వయసు(43)లో డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. అర్జున, పద్మశ్రీ వంటి పురస్కారాలూ అందుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించినా ప్రొఫెషనల్‌ గ్రాండ్‌స్లామ్‌, ఏటీపీ టోర్నీలలో మాత్రం కొనసాగనున్నాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News