Wednesday, May 7, 2025

సరిహద్దుల్లో నేడు వైమానిక యుద్ధ విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

రాఫెల్, మిరాజ్, సుఖోయ్ యుద్ధ
విమానాలతో విన్యాసాలు బుధవారం
రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం
తెల్లవారుజాము వరకు డిఫెన్స్ డ్రిల్స్

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో గల సరిహద్దులలో మే 7,8 తేదీల్లో భారీఎత్తున వైమానిక దళం విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఎయిర్ మెన్ (సోటమ్)కు నోటీసులు జారీ చేసినట్లు జియా- ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ మంగళవారం వెల్లడించారు. . అలాగే దేశవ్యాప్తంగా 259 ప్రదేశాలలో సైనిక దళాలు పౌర రక్షణ విన్యాసాలకు ప్లాన్ చేశాయి. భారత వైమానిక దళం నిర్వహించే విన్యాసాలలో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్ -30 తో సహా ప్రధాన యుద్ధ విమాన శ్రేణి ఈ విన్యాసాలలో పాల్గొంటాయి. వైమానిక దళ విన్యాసాలను వైమానిక దళం ఉన్నతాధికారులు అందరూ పర్యవేక్షిస్తారు. వాటి ప్రమాణాలను మెరుగుపరుస్తారు. విన్యాసాల సమయంలో ఈ ప్రాంతంలో పరిమిత గగనతల వినియోగాన్ని నోటమ్ సూచిస్తుంది. ఇది భారత వైమానిక దళం పెద్దఎత్తున చేపట్టిన మిలిటరీ డ్రిల్‌గా భావిస్తున్నా రు. పహల్గాంలో ఏప్రిల్ 22న టెర్రరిస్ట్ ల దాడిలో 26 మంది మరణాల తర్వాత భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు హెచ్చిన నేపథ్యంలో జరుగుతున్న భారీ సైనిక విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారతదేశం సైనిక పాటవాన్ని యుద్ధ సన్నద్ధతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, శతృదేశం గుండెల్లో దడ పుట్టించే లక్ష్యంతోనే ఈ డిఫెన్స్ డ్రిల్‌కు ప్లాన్ చేశారు. గత నెల ఏప్రిల్ 25న భారతదేశం తన ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్‌లు, ఎలైట్ పైలెట్ లతో పెద్దఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. నౌకాదళం తన పోరాట సంసిద్ధతను ప్రదర్శించింది. భారత వైమానిక దళం అత్యాధునిక రాఫెల్ జెట్‌లు, అగ్రశ్రేణి పైలెట్‌లను ఈ వినాసాలకోసం నియోగించింది. ఈ విన్యాసాలకు -ఆక్రమణ్ – అని పేరు పెట్టారు. ఎస్యు- 30 ఎంకెఐ స్క్వాడ్రన్‌లతో పర్వత ప్రాంతాలతో సహా వివిధ భూభాగాలలో పైలెట్లు విన్యాసాలు నిర్వహిస్తారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత భారత ప్రభు త్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ డ్రిల్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విన్యాసాలు 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 259 ప్రదేశాలలో జరుగుతాయి. ము న్ముందు యుద్ధం జరిగితే, ఆ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రజలను సర్వసన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ డ్రిల్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News