Monday, April 29, 2024

సిరీస్‌పై ఇంగ్లండ్ కన్ను

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంగ్లండ్‌తో శనివారం జరిగే రెండో టి20 మ్యాచ్ భారత్ మహిళలకు సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి హర్మన్‌సేనకు మరో మార్గం లేదు. తొలి టి20లో గెలిచిన ఇంగ్లండ్ మహిళలు సిరీస్‌పై కన్నేశారు. ఈసారి కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. తొలి టి20లో విఫలమైన ఓపెనర్ డంక్లి, అలైస్ కాప్సె ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మొదటి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్ వ్యాట్, నాట్ సివర్‌లపై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరు తొలి టి20లో విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.

ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ఆమీ జోన్స్, కెప్టెన్ హీథర్ నైట్, కెంప్, ఎక్లెస్టోన్, సారా తదితరులతో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో ఆతిథ్య భారత్‌కు రెండో మ్యాచ్‌లో విజయం విజయం అంత తేలికేం కాదనే చెప్పాలి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్,పూజా వస్త్రాకర్ తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలి. తొలి టి20లో షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ మెరుగైన ఆటను కనబరచక తప్పదు. అప్పుడే గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకుంటే సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News