Saturday, April 27, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: వరుసగా రెండు రోజుల పాటు లాభాలను మూటకట్టుకున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వారాంతపు డెరివేటివ్స్ ఎక్స్ పైరీ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230.12 పాయింట్లు లేక 0.37 శాతం కోల్పోయి 61,750.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 65.75పాయింట్లు లేక 0.36 శాతం నష్టపోయి 18,343.90 వద్ద ముగిసింది.

బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (1.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.63%), భారతి ఎయిర్ టెల్ (0.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.55%), యాక్సిస్ బ్యాంక్ (0.39%).

టాప్ లూజర్స్:
టైటాన్ (-2.21%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.16%), మారుతి (-1.63%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.39%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.31%).

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News