- Advertisement -
ఢిల్లీ: ముంబయి విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయింది. గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్ కావడంతో ముంబయిలో విమానాన్ని పైలట్లు ల్యాండింగ్ చేశారు. ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ ప్రయాణికులకు పైలట్ సంకేతం ఇచ్చాడు. ప్యాన్ అంటే ప్రాణాపాయం లేదు కానీ అత్యావసరంగా విమానం ల్యాండ్ అవుతుందని పైలట్ చెప్పాడు. ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి గోవా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు.
- Advertisement -