Sunday, September 7, 2025

సాంకేతిక లోపం.. 2 గంటలు ఆకాశంలోనే విమానం

- Advertisement -
- Advertisement -

కొచ్చి: అబుదాబికి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో శనివారం తెల్లవారుజామున కొచ్చికి తిరిగొచ్చింది. అది కూడా రెండు గంటలపాటు ఆకాశంలో ఉన్నాక అని ఫ్లయిట్ ఆపరేటర్ తెలిపారు. ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఫ్లయిట్ 6ఈ1403 (సిఒకెఎయుహెచ్) శుక్రవారం రాత్రి 11.10కి బయలుదేరింది. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో శనివారం తెల్లవారు జామున 1.44 గంటలకు తిరిగొచ్చేసిందని అభిజ్ఞవర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. కాగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో విమాన సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News