Thursday, August 21, 2025

టచ్ హాస్పటల్‌కు అంతర్జాతీయ గౌరవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రికి అంతర్జాతీయ గౌరవం దక్కిందని టచ్ ఆసుపత్రి నిర్వహాకులు మాటేటి శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టచ్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్డియాలజిస్టు డాక్టర్ రాజేష్ బుర్కుండే మలేషియాలోని కౌలాలంపూర్ లో 2026 మే నెల 4,5 తేదిలలో జరుగనున్న 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్డియాలజీ అండ్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ లో స్పికర్‌గా ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిఫుణులు, పరిశోదకులు పాల్గోనడం జరుగుతుందన్నారు. భారత దేశం నుండి ప్రాతినిధ్యం వహించనున్న డాక్టర్ రాజేష్ కార్డియాలజీ రంగంలో తన అనుభవం, పరిశోధనలపై ప్రసంగం ఇవ్వనున్నారని వారు తెలిపారు.

మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రిలో వైద్యులు అనేక క్లిష్టమైన ప్రొసిజర్స్ విజయవంతం చేసి అనేక మంది రోగుల ప్రాణాలు రక్షించడం జరిగిందన్నారు. అడ్వాన్స్ క్యాత్ లాబ్ ద్వారా అనేక హృదయ సంబందిత అత్యవసర సేవలను విజయవంతంగా అందిస్తుందన్నారు. టచ్ ఆస్పటల్ వైద్యుడు రాజేష్ బుర్కుండే కు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించడం అభినందనీయమని వారు కొనియాడారు. డాక్టర్ రాజేష్ కు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News