Wednesday, June 5, 2024

ఈ ఏడాది చివరికల్లా సాధారణ స్థితికి విమాన ప్రయాణాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరినాటికి సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సల్ వెల్లడించినట్టు ఓ మీడియా సంస్థ పేర్కొంది. కరోనా కారణంగా గత ఏడాది లాక్‌డౌన్ వేళ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు అత్యవసర సరకులు, ఔషధాల సరఫరా మినహా మిగతా విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం, టీకా కార్యక్రమం సజావుగా సాగుతుండడంతో ఆంక్షల్లో సడలింపులు వచ్చాయి. మరోపక్క గత నెల నుంచి దేశీయంగా పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియలో భాగంగా పర్యాటక వీసాలను తిరిగి మంజూరు చేస్తామని గత నెల కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి వాటిని జారీ చేస్తోంది.

International Regular flights normalisation by 2021 end

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News