Friday, May 3, 2024

మూడు ముళ్ల దారం..

- Advertisement -
- Advertisement -

దేవుడు ఆమెకు నోరిచ్చి కిందికి పంపాడు….
కానీ కొందరు ఆమెను మూగదాన్ని చేసి
అత్తగారింటికి సాగనొంపారు…
జీవం లేని ‘జిలకర’ బెల్లానికేం తెలుసు ఆమె రోదన….
మూడు ముళ్ల దారం దాటిస్తుంద ఆమె కలల తీరాన్ని…
కట్టుబాట్లను ఆమెకి పట్టుచీరల కట్టి…
సుడిగుండం లాంటి మట్టెలతో..
మనసుతో పని లేని మంత్రాలు..
తనువు కాలిపోతున్నట్లు
నెత్తిన పడే తలంబ్రాలు…
కన్నీళ్ళతో ఆపలేని సప్పుల్ల నడుమ…
నలిగిపోతున్న ఆమె ‘మనసు’
ఎవరికి అవసరం…
కట్టుకున్న వాడికి ఆమె దేహం కామదాహం తీర్చే బావి….
ఆడదాని మనసుతో సంబంధం లేని
ఒక మగాడు చేసే కాపురమే….
నిజమైన అత్యాచారం….
కాకపోతే తులం బంగారం మెడలో కట్టి చేస్తాడు…
ఎవరి చదువు ఆమెకి న్యాయం చేయగలదు…!
ఎంతమంది సంపద ఆమె జీవితాన్ని మార్చగలదు….!!
ఆమె ఒక ఎడ్డిదే కావచ్చు…
కానీ వాళ్ళు ద్రోహులు….
ఆమె కన్నీళ్లకు చాలా బలముంది…
వాళ్ళకి శిక్ష ఆమె వేయాల్సిన అవసరం లేదు…
కాలం వేసే రోజు.. ఆమె కండ్లు చూసే రోజు వస్తుంది..!!

(కొందరి ‘పెద్దరికానికి’ తమ జీవితాన్నే త్యాగం చేసిన మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు)

తుమ్మల కల్పన రెడ్డి
9640462142

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News