Saturday, April 20, 2024

ఆ కంపెనీలపై రైడ్స్ చేయగలరా?: కెటిఆర్ సవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అదానీ గ్రూప్ కంపెనీల కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ, ఆదాయం పన్ను శాఖ(ఐటి), సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబి) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు మంత్రి కేటీఆర్ బుధవారం ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు. అదానీ గ్రూపు కంపెనీలు లావాదేవీలలో అక్రమాలు, మోసాలు జరిగినట్లు అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ జరిపిన దర్యాప్తు నివేదిక బయటపెట్టినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.

ఇడి, సిబిఐ, ఐటి, సెబి.. హై దమ్ ప్రోబ్ కర్నే కా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, ప్రధాన స్రవంతిలోని జాతీయ మీడియా ఈ నివేదికను ప్రచురించడం లేదా చర్చించడం వంటివి చేయబోవని తాను కచ్ఛితంగా చెప్పగలనని, సామాజిక మాధ్యమాల నుంచి సైతం ఈ నివేదికను తొలగించడానికి కేంద్రంలోని ఎన్‌పిఎ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News