Friday, April 26, 2024

IPL 2023: చెలరేగిన చెన్నై బ్యాట్స్ మెన్స్.. లక్నోకు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపిఎల్)16వ సీజ‌న్ లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(57), కాన్వే(47)లు ధనాధన్ బ్యాటింగ్ తో అలరించారు.

ఫోర్లు సిక్స్ లతో చెలరేగడంతో స్కోరు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్ళింది. వీరిద్దరూ కలిసి 9 ఓవర్లలోనే 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత శివమ్ దూబే(27), రాయుడు(27), కెప్టెన్ ధోనీ(12)లు బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News