Friday, September 12, 2025

కోల్‌కతాకు కీలకం.. నేడు బెంగళూరుతో ఢీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం జరిగే కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఐదింటిలో ఓటమి పాలైంది. ఇక బెంగళూరు ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలను సొంత చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది.

Also Read: రెజ్లర్ల పిటిషన్‌పై 28న విచారణ

కోల్‌కతాతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బెంగళూరు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్, కార్తీక్, షాబాజ్ అహ్మద్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక సిరాజ్, పర్నెల్, హర్షల్, హసరంగాలతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక కోల్‌కతాను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. లిటన్ దాస్, జాసన్ రాయ్, నితీష్ రాణా, రింకు సింగ్ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News