Monday, September 15, 2025

IPL 2023: ముంబయిపై బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ 2023 లీగ్ దశలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో ముంబయి ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కాగా, ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై కచ్చితంగా గెలవాల్సిందే. ఇక, ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచి జోరు కొనసాగించాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News