Saturday, April 20, 2024

ఐపిఎల్ షెడ్యూల్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు బిసిసిఐ పండగలాంటి వార్త చెప్పింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)2023 సీజన్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి చివరి రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ మహా సంగ్రామంలో 10 జట్లు, 70 మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది. కాగా, ఈ లీగ్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుండగా ఫైనల్ మ్యాచ్ మే 28న నిర్వహించనున్నారు. అయితే లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన బిసిసిఐ పేఆప్స్, ఫైనల్ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించలేదు.

ఇక పది జట్లు పాల్గొనే ఈ సీజన్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు ఉంటాయి. కాగా, ఒక్కో జట్టు తమ హోం గ్రౌండ్‌లలో ఏడేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. పది జట్లు రెండు గ్రూప్‌లుగా తలపడనున్న ఈ సీజన్‌లో గ్రూప్‌ఎలో ముంబై, ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్‌బిలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్సలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల నిర్వహణకు బిసిసిఐ 12 వేదికలను ఎంపిక చేయగా అందులో హైదరాబాద్, అహ్మదాబాద్, మొహాలి, లక్నో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువాహటి, ధర్మశాల ఉన్నాయి. డబుల్ హెగార్ ఉన్నప్పుడు మధ్యాహ్నం 3గం.లకు ఒక మ్యాచ్, రాత్రి 7గం.లకు మరో మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News