Tuesday, April 23, 2024

రాణించని సన్ రైజర్స్ బ్యాటర్లు… గుజరాత్ లక్ష్యం 163 పరుగులు

- Advertisement -
- Advertisement -

గుజరాత్ తో జరుగుతున్న ఐపీఎల్ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మునుపటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ పై భారీ స్కోర్ చేసి అభిమానులను అలరించిన సన్ రైజర్స్, ఈసారి ఆ స్థాయిలో ఆడలేకపోయింది. బ్యాటర్లలో ఎవరూ 30 పరుగులు కూడా చేయకపోవడం గమనార్హం.

అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ చెరో 29 పరుగులు చేసి, టాప్ స్కోరర్లుగా నిలిచారు. క్లాసెన్ అనుకున్న తీరులో రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. మార్ క్రమ్ (17) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టాడు. కాగా, గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మకు మూడు వికెట్లు దక్కాయి. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News