Saturday, May 3, 2025

చెలరేగిన గుజరాత్ బ్యాటర్లు.. సన్ రైజర్స్ కు భారీ టార్గెట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(76), సాయి సుదర్శన్(48)లు ధనాధన్ బ్యాటింగ్ తో తొలి వికెట్ కు 6.5 ఓవర్లలోనే 87 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత బట్లర్(64) మెరుపులు మెరిపించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్(21) వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News