- Advertisement -
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆశించినంత స్కోరు సాధించలేకపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాను చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ దెబ్బ కొట్టాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టి కోల్ కతాకు బ్రేకులు వేశాడు. సునీల్ నరైన్(26), అజింక్యా రహానే(48), మనీష్ పాండే(36 నాటౌట్), రస్సెల్(38)లు రాణించడంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా, చెన్నై జట్టుకు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక, చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీందర జడేజా, కంబోజ్ లు తలో వికెట్ తీశారు.
- Advertisement -