ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2025 తిరిగి పునఃప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మద్య ఇవాళ కీలక పోరు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో బెంగళూరు ఉండగా.. ఆరో స్థానంలో కోల్ కతా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకోవాలని బెంగళూరు భావిస్తుండగా.. ఆర్సీబిని ఓడించి ప్లేఆఫ్ రేసులో నిలవాలని కోల్ కతా పట్టుదలగా ఉంది. దీంతో ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. అయితే.. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరగనున్న స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ కు అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది.