Sunday, May 25, 2025

డబుల్ ధమాకా.. ఇవాళ ఐపిఎల్ లో రెండు మ్యాచ్ లు

- Advertisement -
- Advertisement -

క్రికెట్ లవర్స్ కు ఆదివారం డబుల్ ధమాకా లభించనుంది. ఇవాళ ఐపిఎల్ 2025లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకుంది. ఇక, ప్లేఆఫ్ నుంచి ఎలిమినేట్ అయిన చెన్నై.. గుజరాత్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇందులో గుజరాత్ పై విజయంతో ఈ సీజన్ ను ముగించాలని భావిస్తోంది. అలాగే, ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొననున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి వైదొలిగాయి. దీంతో ఇరుజట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News