Thursday, March 28, 2024

షెడ్యూల్ ప్రకారమే మెగా వేలం

- Advertisement -
- Advertisement -

IPL mega auction will be held on 12th and 13th February:Brijesh Patel

ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపిఎల్ మెగా వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈసారి ఐపిఎల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మార్చి నెలలో దీనిపై తుది ప్రకటన చేస్తామన్నారు. ఇక కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నోలకు లెంటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కూడా క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. రెండు బిడ్‌లను గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిందన్నారు.

దీనికి సంబంధించిన ఎల్‌వోఐను త్వరలోనే జారీ చేస్తామని చైర్మన్ వివరించారు. కాగా, మెగా వేలానికి ముందే రెండు కొత్త ఫ్రాంచైజీలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కల్పించామన్నారు. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీలు సహాయక సిబ్బందిని నియమించుకున్నాయన్నారు. ఇక ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడం మిగిలిందన్నారు. కొత్త జట్లకు ప్లేయర్లను ఎంచుకునేందుకు దాదాపు రెండు వారాల వెసులుబాటు ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొత్త ఫ్రాంచైజీల యాజమాన్యాలతో చర్చలు జరిపామన్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు కొత్త జట్లకు తగినంత సమయం ఇచ్చామన్నారు. ఇక దేశంలోని కొవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నామని, అన్ని అనుకున్నట్టు జరిగితే భారత్‌లోనే ఈసారి ఐపిఎల్ పోటీలు జరుగుతాయనే ధీమాను ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వ్యక్తం చేశారు.

ఐపిఎల్‌కు కొత్త స్పాన్సర్

వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ టోర్నమెంట్‌లో స్పాన్సర్లు మారనున్నారు. ప్రస్తుతం ఐపిఎల్ ప్రధాన స్పాన్సర్‌గా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వ్యవహరిస్తోంది. కానీ వచ్చే ఏడాది నుంచి ఐపిఎల్ స్పాన్సర్‌గా భారత్‌కు టాటా గ్రూప్ వ్యవహరించనుంది. దీనికి ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీని కోసం టాటా గ్రూప్ పెద్ద మొత్తంలో చెల్లించేందుకు అంగీకరించింది. ఇక ఇప్పటి వరకు ఐపిఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన వివో సంస్థ భారత క్రికెట్‌కు రూ.2200 కోట్లను చెల్లించింది. ఈ ఒప్పందం 2022తో ముగియనుంది. కాగా, మరోసారి ఐపిఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు వివో ఆసక్తి చూపించలేదు. దీంతో దేశీయ దిగ్గజం టాటా గ్రూప్‌ను బిసిసిఐ ఐపిఎల్ స్పాన్సర్‌గా ఎంపిక చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News