Tuesday, April 23, 2024

ద్రవ్యోల్బణం భారత్‌లోనే ఎక్కువా..?

- Advertisement -
- Advertisement -

Is inflation high in India

ఇతర దేశాల్లో పరిస్థితి ఏమిటి?
అమెరికా, బ్రిటన్ దేశాల్లో పరిస్థితి ఏమిటి?

న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వస్తువుల ధరలు మండిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న ధరలపై నిరసన గళం పెరుగుతోంది. పెట్రోలు, -డీజిల్ నుంచి దుస్తులు, నిత్యావసరాలు రేట్లు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. దీనికి చమురు ధరలు పెరగడం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల ఒక్క భారతదేశంలోనే ఉందా? లేదా ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందా? అనే సందేహాలు అందరి మదిలో ఉన్నాయి. గత 6 నెలలతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న వస్తువుల ధర పెరగడం లేదా తగ్గడం జరిగితే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయవచ్చు. 6 నెలలు నిరంతరం ధరల పెరుగుదల కొనసాగితే ద్రవ్యోల్బణం గరిష్ఠానికి చేరిందని పేర్కొంటారు.

ఆర్‌బిఐ ప్రకారం, ద్రవ్యోల్బణ రేటు లక్షం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి. ప్రస్తుతం ఏప్రిల్ గణాంకాల ప్రకారం, ఇది 7.79 శాతానికి చేరుకుంది. అంటే 2014 మే నెల నుంచి చూస్తే ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. గత ఒక సంవత్సరంలో అంటే 2021 ఏప్రిల్ నుండి 2022 ఏప్రిల్ మధ్య రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువుల ధరలు ఎంత పెరిగాయో చూస్తే, ఎడిబుల్ ఆయిల్స్ ద్రవ్యోల్బణం 17.28 శాతానికి పెరిగింది. ఆ తర్వాత కూరగాయలు 15.41 శాతం, ఇంధనం, విద్యుత్ ధరలు 10.80 శాతం, దుస్తులపై 9.85 శాతం, ఆహార పదార్థాల ధరలు 8.10 శాతం పెరిగాయి.

మరింత దారుణంగా అమెరికా, బ్రిటన్
భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం సమయంలో వస్తువుల ధరలు ఈ విధంగా పెరిగితే, ప్రపంచంలోనే బలమైన దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ పరిస్థితి ఎలా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఒఇసిడి, జి20 వంటి సంస్థలలో ఈ దేశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ దేశాల్లో ద్రవ్యోల్బణం పరిస్థితి చూస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు 8.3 శాతానికి పెరిగింది. ఇదే 40 ఏళ్ల గరిష్ఠ స్థాయి అని యుఎస్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక బ్రిటన్‌లో 7 శాతానికి చేరగా, ఇది కూడా 1992 నుంచి అత్యధిక స్థాయి కావడం గమనార్హం. మరో దేశం స్పెయిన్‌లో 8.4 శాతం, జర్మనీలో 7.4 శాతం, ఇటలీలో 6.2 శాతం, పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూనే ఉంది.

పాకిస్థాన్‌లో అయితే 15.1 శాతం, అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. అమెరికాలో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రజలు గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నారు. అక్కడ ఆహారం, పానీయాల ధర 10 శాతం పెరగ్గా, విద్యుత్ ధర 32 శాతం పెరిగింది. బ్రిటన్ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. యుకెలో ద్రవ్యోల్బణం 1992 తర్వాత అత్యధిక స్థాయిలో ఉంది. ఇంధన ధరలు 31 సంవత్సరాలలో అత్యధికంగా పెరిగాయి, అయితే ప్రతిరోజూ ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. జర్మనీలో కూడా ద్రవ్యోల్బణంలో బలమైన పెరుగుదల ఉంది. అమెరికా, బ్రిటన్ మాత్రమే కాదు, జర్మనీ 1981 సంవత్సరం తర్వాత చాలా ద్రవ్యోల్బణాన్ని చూస్తోంది.

ప్రపంచ ద్రవ్యోల్బణం ప్రభావం ఏమిటి?
అమెరికా, బ్రిటన్, టర్కీ, పాకిస్థాన్‌తో సహా చాలా దేశాల్లో భారత్‌లో కంటే ద్రవ్యోల్బణం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌తో సహా అనేక యూరోపియన్ దేశాలలో ఆహార, నూనెల నిల్వలు తగ్గుతున్నాయి. ప్రజలు అవసరానికి మించి కొంటున్నారు. ఈ పరిస్థితిలో చాలా యూరోపియన్ దేశాల్లోని సూపర్ మార్కెట్‌లలో వినియోగదారులకు పరిమిత పరిమాణంలో వస్తువులను విక్రయించాలనే నియమం అమలు చేశారు. అంతేకాదు యురోపియన్ దేశాల్లో చాలా పరిశ్రమ, -వ్యాపారాలు ఉద్యోగుల తొలగింపు సంకేతాలు ఇస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News