Tuesday, December 6, 2022

కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ

- Advertisement -

 

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. నవంబర్ 19న పుట్టిన కవలల్లో ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి ఇషాతో పాటు వారి పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అంబానీ కుటుంబం, పిరమల్ కుటుంబం సమాచారం ఇచ్చారు.

కవలల్లో కొడుకు పేరు కృష్ణ అని, కూతురు పేరు ఆదియా అనే పేర్లు పెట్టారు. అంబానీ కుటుంబానికి, దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన పిరమల్ కుటుంబానికి ఇది సంతోషకరమైన సమయాలు. 2018 సంవత్సరంలో ఇషా అంబానీ హెల్త్‌కేర్ బిజినెస్ గ్రూప్ పిరమల్ యజమాని అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Latest Articles