Friday, March 1, 2024

200 హమాస్ లక్షాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: హమాస్‌తో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్ భూతల దాడులతోపాటు వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఆదివారం రాత్రి దాదాపు 200 హమాస్ లక్షాలపై వైమానిక దళం బాంబుల దాడులు చేసింది. గాజా లోని అనేక హమాస్ స్థావరాలను తమ నెగెవ్ బ్రిగేడ్ ధ్వంసం చేసిందని ఐడిఎఫ్ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర గాజా లోని బెయిట్ హనౌస్ లో ఉన్న ఓ పాఠశాల ఆవరణ లోని రెండు సొరంగాల ద్వారాలను ఐడిఎఫ్ కనుగొనగలిగింది. వీటిలో ఒక దానిలో ఇజ్రాయెల్ దళాల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్‌ను గుర్తించి నిర్వీర్యం చేశారు. క్షిపణులు, గన్స్‌తో సంచరిస్తున్న హమాస్ కార్లను తాము ప్రధాన లక్షంగా చేసుకొన్నట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. గాజా తీరంలో హమాస్ అబ్జర్వేషన్ పోస్టులను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ నౌకాదళం దాడులు చేస్తోంది.

బందీ ప్రాణాలు తీసిన హమాస్
బందీగా ఉన్న యోనాతన్ సమరానో అనే యువకుడిని హమాస్ ఇటీవల హత్య చేసింది. ఇప్పటికీ అతడి మృతదేహం హమాస్ అధీనం లోనే ఉన్నట్టు ఇజ్రాయెల్ దళాలు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. అక్టోబర్ 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై దాడి చేసిన సమయంలో అతడిని హమాస్ కిడ్నాప్ చేసింది. ఆ తరువాత అతని కుటుంబ సభ్యులతో అతడిని మాట్లాడించింది. ఆ తరువాత అతనితో సంబంధాలు తెగిపోయాయి. కొన్నాళ్లకు అతనితోపాటు ఉన్న మిత్రుల మృతదేహాలు బయటపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News