Friday, September 20, 2024

అట్టుడికిన పశ్చిమాసియా

- Advertisement -
- Advertisement -

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరొకసారి విరుచుకుపడింది. ఇజ్రాయెల్ వంద ఫైటర్ జెట్లతో రాకెట్ల వర్షం కురిపించింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా రాకెట్ లాంచర్ బారెల్స్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ మీడియా వెల్లడించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పైకి 320 క్షిపణులను ప్రయోగించామని హెజ్బొల్లా ప్రకటించింది. అయితే, ఆ క్షిపణులను తాము మధ్యలోనే కూల్చివేశామని ఇజ్రాయెల్ తెలియజేసింది. దీనిపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, తమపై దాడి చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రతి దాడి చేస్తామనే హెచ్చరికతో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, హెజ్బొల్లా దాడుల నేపథ్యంలో దేశంలో 48 గంటల ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గాలంట్ ప్రకటించారు. మరొక వైపు, బందీల విడుదలకు సంబంధించి నిఘా సంస్థల ప్రతినిధులు మొసాద్, షిన్ బెట్ చీఫ్‌లు కైరోలో చర్చలకు వెళ్లారు.

ఫాద్ షుక్రు హత్యకు ప్రతీకారం
తమ నేత ఫాద్ ఫుక్రు హత్యకు ప్రతీకారంగా తొలి విడత దాడి మొదలుపెట్టినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్‌లోని 11 స్థావరాలను లక్షంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా వివరించింది. కాగా, సైనిక శిక్షణ, ఆయుధ సరఫరా విషయంలో హెజ్బొల్లాకు ఇరాన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సిరియా పాలకులు కూడా హెజ్బొల్లాకు అందగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. 2022లో జరిగిన లెబనాన్ ఎన్నికల్లో హెజ్బొల్లా సంస్థ 13 సీట్లు గెలుచుకున్నది. అయితే, హెజ్బొల్లాను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News