Thursday, April 25, 2024

లెబనాన్‌తో ‘చారిత్రక’ సముద్ర సరిహద్దు ఒప్పందం కుదిరింది: ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

Yair Lapid

జెరూసలెం: ఇజ్రాయెల్  ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ మంగళవారం అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాత దేశం తమ భాగస్వామ్య సముద్ర సరిహద్దుపై పొరుగున ఉన్న లెబనాన్‌తో “చారిత్రక ఒప్పందాన్ని” కుదుర్చుకున్నట్లు చెప్పారు. యైర్ లాపిడ్ ఈ ఒప్పందాన్ని “ఇజ్రాయెల్ భద్రతను బలోపేతం చేసే, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలోకి బిలియన్లను చొప్పించే,  మన ఉత్తర సరిహద్దు స్థిరత్వాన్ని నిర్ధారించే చారిత్రాత్మక విజయం” అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం మధ్యధరా సముద్రంలో అదనపు సహజవాయువు ఉత్పత్తికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. గ్యాస్ అన్వేషణ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేయడంలో సహాయపడుతుందని లెబనాన్ భావిస్తోంది.

1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి లెబనాన్,  ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుంటున్నాయి. రెండు దేశాలు మధ్యధరా సముద్రం యొక్క దాదాపు 860 చదరపు కిలోమీటర్లు (330 చదరపు మైళ్ళు) దూారాన్ని క్లెయిమ్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News