Thursday, May 2, 2024

స్వచ్ఛంద సంస్థ వాహనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: మానవతా సహాయం కింద ఆహారాన్ని సరఫరా చేసే వరల్డ్ సెంట్రల్ కిచెన్(డబ్లుసికె) అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనాలపై ఇజ్రాయెలీ సేనలు సెంట్రల్ గాజాలో సోమవారం జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు కార్మికులు మరణించారు. మృతులలో ఆస్ట్రేలియా, బ్రిటన్, పోలాండ్, పాలస్తీనాకు చెందిన పౌరులతోపాటు అమెరికా, కెనడా ద్విపౌరసత్వం ఉన్న పౌరుడు కూడా ఉన్నాడు. అంతర్జాతీయ మానవతా సహాయ సంస్థలకార్మికులను భయభ్రాంతులను చేయడమే లక్షంగా ఈ దాడి జరిగిందని హమాస్ తెలిపింది.

ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం దీన్ని విషాద ఘటనగా అభివర్ణించింది. అంతర్జాతీయంగా పేరు గడించిన చెఫ్ జోస్ ఆండెస్‌కు చెందిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ తరఫున ఈ కార్మికులు పనిచేస్తున్నారని ్డబ్లుసికె తెలిపింది. సముద్రం ద్వారా గాజాకు తరలించిన 100 టన్నులకు పైగా ఉ్నన ఆహారాన్ని గిడ్డంగిలో దింపి డబ్లుసికె లోగో ఉన్న వాహనాలలో వీరంతా బయల్దేరగా వాహనాలపై ఇజ్రాయెలీ రక్షణ దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఇది డబ్లుసికెపైన దాడి కాదని, మానవతా సంస్థలపై జరిపిన దాడని డబ్లుసికె చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఎరిన్ గోర్ తెలిపారు. 2010 హైతీలో భూకంపం సంభవించి ఘోర ప్రాణ నష్టం సంభవించిన తర్వాత ఆండ్రెస్ డబ్లుసికెని ప్రారంభించి ఆ దేశానికి వంటమనుషులను, ఆహారాన్ని పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News