Monday, July 22, 2024

రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. గాజాలో 17మంది పాలస్తీనీయుల మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ వైమానిక దాడులలో మంగళవారం 17 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. వీరిలో ఇద్దరు గాజాలో ఏర్పాటు చేసిన శరథార్థ శిబిరాలకు చెందిన వారు ఉన్నారు. పాలస్తీనాకు చెందిన రఫా నగరంలోకి ఇజ్రాయెలీ ట్యాంకులు చొచ్చుకుపోతున్నట్లు స్థానికులు, వైద్యులు తెలిపారు. రఫాలోని అనేక ప్రాంతాలలో ఇజ్రాయెలీ ట్యాంకులు, విమానాలు భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. రఫాలో మే నెలకు ముందు 10 లక్షల మందికిపైగా శరణార్థులు శిబిరాలు తలదాచుకున్నారు.

రఫా నగరాన్ని ఇజ్రాయెలీ దళాలు ఆక్రమించుకోవడంతో వీరిలో చాలా మంది ఉత్తర దిశగా పారిపోయారు. ప్రపంచం నుంచి ఎటువంటి జోక్యం లేకుండా రఫాపై ఇజ్రాయెలీ బాంబు దాడులు నిర్వరామంగా కొనసాగుతున్నాయని, ఇజ్రాయెలీ దురాక్రమణ నిర్నిరోధంగా కొనసాగుతోందని రఫా స్థానికుడొకరు అంతర్జాతీయ వార్తాసంస్థలకు చాట్ యాప్‌లో తెలిపారు. పాలస్తీనా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఇజ్రాయెలీ బలగాలు తమ దురాక్రమణను ఆపడం లేదని, నగరాన్ని, శరణార్థ శిబిరాలను ధ్వంసం చేస్తున్నారని స్థానికుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News