Saturday, December 14, 2024

గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి… 37 మంది మృతి

- Advertisement -
- Advertisement -

డెయిర్ అల్‌బలా (గాజా స్ట్రిప్): ఉత్తర గాజా లోని శరణార్థుల శిబిరంపై ఆదివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు ఉన్నట్టు గాజా సిటీ అల్ అహ్లీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఫడేల్ నయీమ్ వెల్లడించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జబాలియాలోని శరణార్థుల శిబిరంపై ఈ దాడి జరిగిందని, గత నెల రోజులుగా జబాలియా, దాని పరిసర నగరాలు బీయిట్ లాహియా, బీయిట్ హనోన్‌ను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తాము మిలిటెంట్లను లక్షంగా చేసుకున్నామని, జనావాస ప్రాంతాల్లో దాగుండి వారు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి… 20 మంది మృతి

ఉత్తర లెబనాన్ లోని బీరుట్‌కు ఉత్తర దిక్కుగా ఉన్న అలామత్ అనే గ్రామంలో ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆ ప్రాంతంలో హెజ్‌బొల్లా ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటున్నారు. హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ ప్రాబల్యం ఉన్న లెబనాన్ లోని దక్షిణ , తూర్పు భాగాలకు ఈ ప్రాంతం దూరంగా ఉండటం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News