Thursday, May 2, 2024

ఇస్రో స్మార్ట్ కృత్రిమ పాదాలు

- Advertisement -
- Advertisement -

ISRO made artificial smart feet

 

న్యూఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ వికలాంగుల సౌకర్యార్థం ఆ ధునిక టెక్నాలజీతో స్మార్ట్ కృత్రిమ పాదాలను అభివృద్ధి చేస్తోంది. కాళ్లు లేనివారు సై తం సౌకర్యవంతంగా నడిచేలా వీటిని త యారుచేసి త్వరలో మార్కెట్లో విడుదల చే యనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే కృ త్రిమ పాదాలకంటే ఇస్రో తయారుచేసినవి పదిరెట్లు తక్కువ ఉండనున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పాదాలను మైక్రోప్రాసెససర్ కంట్రోల్డ్ నీస్ పేరుతో లభించనున్నాయని ఇస్రో తెలిపింది. ఈ కృతిమ పాదం బరువు 1.6కేజీల బరువు ఉంటుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. వీటిని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఇస్రోలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిల్టిస్ అ వగాహన ఒప్పందం చేసుకుని వీటిని తయారు చేస్తున్నాయి. స్మార్ట్ కృత్రిమపాదాన్ని మైక్రోప్రాసెసర్, హైడ్రాలిక్ డాంపర్ తదితర ఆధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. అన్నివిధాలుగా పరీక్షించగా విజయవంతమైందని ఇండియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. వీటి ధర రూ.4నుంచి 5లక్షల వర కు ఉంటుందని ఇస్రో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News