Friday, May 3, 2024

కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయండి : అక్బరుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

Issue new Health Sree Cards: Akbaruddin Owaisi

హైదరాబాద్ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. విద్య, వైద్య,యువజన, క్రీడారంగాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఉస్మానియా దవాఖానను అభివృద్ధి చేయాలని కోరారు. పాతబస్తీలో బస్తీ దవాఖానలతో పాటు రోగ నిర్ధారణకు వీలుగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వైద్యశాఖ చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, వాటిని పేదలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ, ఆయుస్మాన్‌భవ పథకంలో వర్తింపజేసే సేవలకు ప్రభుత్వం అందజేసే మొత్తాన్ని పెంచాలని కోరారు. ఇందుకు వీలుగా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని కోరారు.

రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాల్లో అధ్యాపకుల కొరత ఉందని, ఇందుకు సంబంధిత ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాధికారుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని, టీచర్ పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీగా ఉన్నాయని గణంకాలతో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జిల్లా, మండల విద్యాధికారుల ఖాళీలతో విద్యావ్యవస్థ నిర్వహణ అధ్వానంగా మారుతోందన్నారు. బాసర ఐఐటిలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని, భోజనం నాణ్యతగా ఉండడం లేదని సభ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో యువత క్రీడ శిక్షణకు దూరమవుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, క్రీడా రంగాల్లో ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News