- Advertisement -
17వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.రాధిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్వాల్ ప్రభుత్వ ఐటిఐ కాళాశాలలో ఉదయం 11 గంటలకు జరుగు జాబ్‌మేళాలో వైఎస్‌కె ఇన్ఫోటెక్ ప్రైవేట లిమిటెడ్ సంస్థలో వెల్డర్, ఫిట్టర్, గ్రైండర్, గ్యాస్ కట్టర్ ఉద్యోగాలకు ఇంటర్యూలు జరుగుతాయని అన్నారు. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందజేస్తారని చెప్పారు. ఐటిఐ పూర్తి చేసిన వ్యక్తులకు అప్రెంటిస్ షిప్ అందించబడుతుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన యువతి, యువకులు ఎంప్లాయిమెంట్ కార్డు కోసం www.employment.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
- Advertisement -