Thursday, May 22, 2025

జట్టును వీడిపోతే మంచిది.. ధోనీకి మాజీ క్రికెటర్ సలహా

- Advertisement -
- Advertisement -

ఐదుసార్లు ట్రోఫీని ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపిఎల్ 18వ సీజన్ మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. ఇప్పటివరకూ కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్ అట్టడుగు స్థానంలో ఉంది. అయితే ఈ సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ గాయం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న ఎంఎస్ ధోనీ(Dhoni). అటు కెప్టెన్‌గా ఇటు బాట్స్‌మె‌న్‌గా విఫలమవుతున్నారు. మొత్తం 13 మ్యాచుల్లో అతను కేవలం 196 పరుగులు మాత్రమే చేశారు. అందులో అత్యధిక స్కోర్ 30 నాటౌట్.

దీంతో ధోనీ (Dhoni).. ఇకపై రిటైరై యువకులకు అవకాశం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొందరు మాజీలు కూడా ధోనీ ఇకపై తప్పుకోవాలని అంటూన్నారు. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వయసు పెరుగుతోంది కాబట్టి అతడి నుంచి మనం ఎక్కువ ఆశించడం తప్పు అని అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ధోనీ వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. ధోనీకి హిట్టింగ్ చేయడం రాకపోతే.. ‘నా వల్ల కాదు.. నేనిది చేయలేను’ అని జట్టును విడిపోతే మంచిది అని శ్రీకాంత్ అన్నారు. ధోనీ ఇలా చేస్తేనే మంచిదని.. లేకుండా ఇంకా కొనసాగుతూ ఉంటే ఏ పాత్ర పోషిస్తాడని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News