Wednesday, November 13, 2024

హార్డ్ హిట్టర్లకు జాక్‌పాట్?

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ వచ్చే సీజన్ ముందు మెగా వేలం పాట నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ హైదరబాద్ ఫ్రాంచైజీ తాము రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఖరారు చేస్తున్నట్టు సమాచారం. కిందటి సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లతో పాటు నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్ అట్టిపెట్టుకునే అవకాశాలున్నాయి. అంతేగాక అద్భుత కెప్టెన్సీతో అలరించిన్ పాట్ కమిన్స్‌ను కూడా రూ.18 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంటుందని తెలిసింది. అభిషేక్ శర్మకు దాదాపు రూ.18 కోట్లను చెల్లించేందుకు ఫ్రాంచైజీ ముందుకు వచ్చినట్టు సమాచారం. ఇక పవర్ హిట్టర్ క్లాసెన్ కోసం ఏకంగా రూ.23 కోట్లను వెచ్చించాలని ఫ్రాంచైజీ యాజమాన్యం భావిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News