Saturday, July 19, 2025

లోకేష్‌తో కెటిఆర్ రహాస్య భేటీ మతలబు ఏమిటీ?.. ప్రశ్నించిన జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కె. తారక రామారావు టిడిపి నాయకుడు లోకేష్‌తో, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వేర్వేరుగా రహాస్య మంతనాలు జరిపారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ రహాస్య భేటీ ఆంతర్యం ఏమిటీ? అని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. పదేళ్ళు రాజభోగాలు అనుభవించిన బిఆర్‌ఎస్ నేతలకు ఇప్పుడు అధికారం లేకపోవడంతో షాక్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధుల కోసం కేంద్రం వద్దకు వెళితే బిఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారని, వారికి బాధ్యత లేదు, బరువు అసలే లేదని అన్నారు.

మాజీ మంత్రి టి. హరీష్ రావు పెద్ద నటుడని ఆయన విమర్శించారు. హరీష్ రావులా తమ పార్టీ నాయకుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నటుడు కాదని, యుద్ధ విమానాలు నడిపిన ఫైటర్ అని ఆయన తెలిపారు. కెసిఆర్ ఉన్నంత వరకే కెటిఆర్, టి. హరీష్ రావు ఉనికి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖాముఖి చర్చకు రావాలంటే కెసిఆర్ ముందుకు రావడం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి తోక— తొండం తెలియదని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిపించి మాట్లాడారు కాబట్టి మీకే నివేదిక వస్తుంది కదా, అయినా వివరాలు బయట పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News