Friday, September 20, 2024

కల్లు తాగిన కోతిలా కెటిఆర్ మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశం కోసం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే బిఆర్‌ఎస్ నేత కెటిఆర్‌కు అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. కెటిఆర్‌కు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పొలిటికల్ ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుందని చురకలంటించారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ భారత దేశానికి టెక్నాలజీ తీసుకొచ్చారని, ఆయన తెచ్చిన టెక్నాలజీతోనే కెటిఆర్ చదువుకున్నారని, ఇప్పుడు కల్లు తాగిన కోతిలా కెటిఆర్ మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ చరిత్ర అసలు కెటిఆర్‌కు తెలియదని, రాజీవ్ గాంధీ మిలిటెంట్ల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని, చెరపలేని చరిత్ర వాళ్లదని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన బాధలో కెటిఆర్ ఏదో ఒకటి మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారని, కెటిఆర్‌కు కలుగుతున్న బాధేంటో తమకు అర్థం కావడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News