ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాల్లో ఒకటి ఫీల్డింగ్. చేతికందిన క్యాచ్‌లను చేజార్చుకొని జట్టు పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో దాదాపు టీం ఇండియా ఆరు క్యాచులు మిస్ చేయగా.. అందులో యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) నాలుగు క్యాచ్‌లు వదిలేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో బెన్ డక్కెట్ క్యాచ్‌ని వదిలి.. ఇంగ్లండ్ విజయానికి పరోక్షంగా కారణమయ్యాడు.
దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ జైస్వాల్‌పై (Yashasvi Jaiswal) కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌లో జైస్వాల్ రాణించినప్పటికీ.. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్‌లను చేజార్చుకున్నాడు. దీంతో జైస్వాల్‌ని స్లిప్‌లో ఫీల్డింగ్ నుంచి తప్పించినట్లు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తెలిపారు. అతనిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జైస్వాల్ మంచి ఫీల్డర్ అని.. గతంలో చాలా క్యాచ్‌లు అతను అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కొంతకాలం జైస్వాల్ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేయడు అని పేర్కొన్నారు.