Tuesday, September 16, 2025

‘జటాధర’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్ ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. అద్భుతమైన విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఇలీవల విడుదలై నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యింది. మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జటాధర సినిమా నవంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ లాంటి అద్భుత తారాగణం స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న జటాధరను ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News