Wednesday, October 9, 2024

జవహర్ నగర్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి… రాంకీ కార్యాలయంపై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను డిసిఎం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాజీ ఉప సర్పంచ్ కందాడి అమరేందర్ రెడ్డి తన భార్య ప్రమీలతో కలిసి బైక్ పై హైదరాబాద్ నుంచి తిమ్మాయిపల్లికి వెళ్తున్నాడు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద బైక్ ను డిసిఎం ఢీకొట్టడంతో అమరేందర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. భార్య ప్రమీల తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమీల గతంలో ఎంపిటిసిగా సేవలు అందించారు.

డంపింగ్ యార్డుతో ప్రమాదం జరిగిందని తిమ్మాయిపల్లి వాసులు, మృతుడి బంధువులు రాంకీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. మృతదేహాన్ని కార్యాలయం ముందు ఉంచి ఆందోళనకు దిగారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వ్యర్థ రసాయానాలు బయటకు రావడంతో వాహనాలు జారి ప్రమాదానికి గురవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వ్యర్థ రసాయానాలు రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలు జరిగి స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News