Monday, September 1, 2025

భూపాలపల్లిలో పిడుగు పడి కుమారుడు మృతి… తండ్రి ఎగిరిపడ్డాడు

- Advertisement -
- Advertisement -

మల్లారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో పిడుగుపడి యువకుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లారం గ్రామంలో మొగిలయ్య, సునీత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు నాగరాజు డిప్లొమా పూర్తి చేసి ఇంటి వద్ద తండ్రికి పొలం పనులకు సహాయం చేసేవాడు. బోరు మోటర్‌ను వెలికి తీసేందుకు తండ్రితో కలిసి నాగరాజు మానేరు నదిలోకి వెళ్లాడు. బోరులోని మోటార్‌ను బయటకు తీస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. భారీ శబ్ధంతో నాగరాజుపై పిడుగు పడడంతో అతడు ఘటనా స్థలంలో మృతి చెందాడు. తండ్రి మొగిలయ్య ఎగిరి రెండు మీటర్ల దూరంలో పడ్డాడు. ఈ ప్రమాదంలో మొగిలయ్య కాలుకు గాయాలయ్యాయి. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News