Thursday, February 9, 2023

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్… ఆస్తులు జప్తు

- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. బీఎస్‌-4 వాహనాల కుంభకోణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సహచరులు, కంపెనీలకు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.

అశోక్ లేలాండ్ లిమిటెడ్ నుండి బిఎస్-3 వాహనాలను తగ్గింపు ధరకు కొనుగోలు చేసి, ఇన్‌వాయిస్ కాపీలను రూపొందించి బిఎస్-4 వాహనాలుగా నమోదు చేశారనే ఆరోపణలపై జెసి ప్రభాకర్ రెడ్డిపై ఇడి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ ఈరోజు జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కుంభకోణంలో అశోక్ లేలాండ్ పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles