క్రికెట్‌లో రికార్డులు సృష్టించడానికి వయస్సుతో, అనుభవంతో సంబంధం లేదు. ఈ మధ్యకాలంలో.. యువ క్రికెటర్లే ఎక్కువగా సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా దులీప్ ట్రోఫీలో 21 ఏళ్ల కుర్రాడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డును సమం చేశాడు. ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న మానిషి (Manishi).. తొలి ఇన్నింగ్స్‌లోనే ఆరు వికెట్లు పడగొట్టాడు. నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనతను సాధించాడు.
ఇక మానిషి (Manishi) తీసిన ఈ 6 వికెట్లు ఎల్‌బిడబ్ల్యూ రూపంలోనే రావడం మరో విశేషం. ఈ కారణంగానే అతని పేరిట ప్రపంచరికార్డు సమోదైంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మానిషికి ముందుకు కేవలం ఐదుగురు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్‌బిడబ్ల్యూ చేశారు. వీరందరూ విదేశీయులే కాగా, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా మానిషి నిలిచాడు. మార్క్ ఇలాల్(1995), చమింద వాస్ (2005), తబిష్ ఖాన్ (2012), ఓలీ రాబిన్సన్ (2021), క్రిస్ రైట్‌తో (2021) కలిసి ప్రపంచ రికార్డును సమం చేశాడు. దీంతో మానిషిపై ఐపిఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించే అవకాశం ఉంది.
Also Read : చరిత్ర సృష్టించిన బౌలర్.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు