లక్నో: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో ఆర్‌సిబి తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ (Jitesh Sharma) కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆరు లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ధోనీ 2018లో ఆర్‌సిబిపై 34 బంతుల్లో 70 పరుగులు చేయగా.. జితేశ్ శర్మ (Jitesh Sharma) 33 బంతుల్లో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్‌ఎస్‌జి జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది. కెప్టెన్ పంత్ అద్భుత శతకం, మార్ష్ అర్థశతకంతో జట్టుకు ఈ భారీ స్కోర్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 230 పరుగులు చేసి విజయం సాధించింది. ఫలితంగా క్వాలిఫయర్-1లో ఆర్‌సిబి, పంజాబ్‌తో తలపడనుంది.