Wednesday, April 24, 2024

అప్‌గ్రేడ్ కాకపోతే ఔట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.ఆ సంస్థలు ముందస్తుగా ఎ లాంటి సమాచారం ఇ వ్వకుండానే.. కేవలం ఓ మెయి ల్ పంపి జాబ్‌లో నుంచి తీసేస్తున్నాయి. ఇష్టానుసారంగా లే ఆఫ్‌ను ప్రకటిస్తున్నాయి. దీంతో కే వలం నెల రోజుల వ్యవధిలోనే దాదాపు యాభై వేల మంది ఉద్యోగులు…నిరుద్యోగులుగా మారారు. ఇందులో ఎక్కువ మందిని బ డాబడా కంపెనీలే తీసేశాయి. బడా కంపెనీలతో లింక్ ఉన్న చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఉ ద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. మరోవైపు చాలా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌లను సైతం ని లిపివేశాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి రో జురోజుకు దిగజారుతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం వ స్తుందనే భయంతో ట్విట్టర్ లాంటి బడా కంపెనీలు ఉద్యోగులను తొలగించగా, అదే దారిలో ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్, హెచ్‌సిఎల్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ వంటి అనేక కంపెనీలు కూడా ఉన్నా యి.

ఇంకా వేల మంది ఐటి ఉద్యోగులపై కత్తి వేలాడుతోందన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిపై టిటా గ్లోబ ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ, ఐటి రంగంలో ఉద్యోగాలు పోతున్నాయన్న భయం ఎ వరికి అవసరం లేదన్నారు. పైగా ఈ రం గంలో ఉద్యోగాల భర్తీ సంఖ్య మరింత పెరగనుందన్నారు. అయితే నైపుణ్యత (స్కిల్)ను ఎప్పటికప్పుడు పెంచుకున్న వా రికి ఎప్పుడు ఉద్యోగాలు ఎదురుచూస్తూనే ఉంటాయన్నారు. ప్రస్తు తం ఐటి రం గంలోఆటోమేషన్, ఎఐ(ఆర్టిఫిషన్ ఇంటిలిజెన్స్) టెక్నాలిజీ అత్యం త కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం 2025 వరకు ప్రపంచ వ్యాప్తంగా 85 మిలియన్ ఉద్యోగాలు ఊడిపోతుండగా…. కొత్త గా 97 మిలియన్ల ఉద్యోగా లు రానున్నాయని వెల్లడించిందన్నారు. అం టే మరో 12 మిలియన్ ఉద్యోగాలు అదనం గా వస్తున్నాయన్నారు. ప్రపంచాన్ని గడగడలాడింటిన కరో నా తరువాత అన్ని రంగాల్లో అనేక మార్పు లు సంభవించాయన్నారు.

ప్రధానంగా డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైందన్నా రు. అలాగే వ్యవసాయం తో పాటు అ న్ని రంగాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులువ చ్చాయన్నారు. ఇవి రావడం వల్ల సహజంగా నే అనేక కంపెనీలు రి క్రూట్‌మెంట్‌ను తగ్గించుకుంటున్నాయన్నారు. వర్టికల్ ప్రాజెక్టుల్లో ఉన్న వారు వెనక్కిపోవడం, గతంలో చేసుకున్న అగ్రిమెంట్లను రద్దు చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఐటి రంగంలో ఉద్యోగాల్లో కోత పడుతోందన్నారు. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదన్నారు. ఐటి రంగంలో వచ్చిన మార్పులు (ఆటోమేషన్, రోబోటెక్ ) వంటి టెక్నాలిజీని ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అదనపు నైపుణ్యత చాలా అవసరమన్నారు.

ప్రస్తుతం ఐటి రంగం అంటే ప్రతి రోజు…ప్రతి క్షణం కూడా కొత్తదనమేనని అన్నారు. ప్రతి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ జరుగుతోందని…అందుకు తగ్గట్టుగా మన నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
2013…2014లో ఐటి రంగంలో 3.26 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 7.78 లక్షలకు చేరుకుందన్నారు. అంటే మన రాష్ట్రంలో ఐటి ఉద్యోగుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరిగిందన్నారు. టెక్నాలిజీకి ఎప్పుడు డౌన్‌ఫాల్ ఉండుందన్నారు. ఈ నేపథ్యంలో యువత నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పైగా మరింత ఉన్నత స్థితికి చేరుకునేందుకు దోహదపడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News