Tuesday, December 10, 2024

సునీతా విలియమ్స్‌ను రక్షించేందుకు నేను అంతరిక్ష కేంద్రానికి వెళ్లవచ్చు:బైడెన్

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు జో బైదెన్ నవ్వులు పువ్వులు పూయించారు. ఐదు నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లను రక్షించడానికి తాను అంతరిక్షానికి వెళ్లవచ్చునని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. వారిద్దరినీ తాను వెనుకకు తీసుకురావచ్చునని చెప్పి బైడెన్ అందరినీ నవ్వించారు. పెరూ అధ్యక్షుడు డీనా బొలార్టే జెగర్రాతో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అంతరిక్ష పరిశోధనలపై చర్చించిన సందర్భంలో బైడెన్ ఈ మేరకు చమత్కరించారు. ‘ప్రస్తుతం అక్కడ ఉన్న వ్యక్తి, ఫ్లోరిడా మాజీ సెనేటర్ (నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌ను ఉద్దేశించి) నాకు చాలా సన్నిహితుడు. నన్ను అంతరిక్షాన్కి పంపించేయవలసిందిగా అతనికి ఫోన్ చేసి చెబుతానని నా భార్య అంటుంద. నన్ను కట్టడి చేయడం కష్టంగా ఉందని ఆమె భావించిన ప్రతిసారీ అంతరిక్షంలోకి పంపిస్తానని చెబుతుంటుంది.

అంతరిక్షానికి పంపిస్తారేమోనని నాకు కొంచెం ఆందోళనగా ఉన్నది. ఎందుకుంటే తిరగి తీసుకురావలసిన మన వ్యోమగాములు అక్కడ ఉన్నారు’ అని బైడెన్ నవ్వుతూ చెప్పారు. ఇక అమెరికా, పెరూ అంతరిక్ష పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటున్నాయని బైడెన్ తెలిపారు. కాగా, అంతరిక్ష వాహక నౌక ‘స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి వారు ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ రోదసి నౌకను జూజ్ 5న ప్రయోగించగా, 6న అంతరిక్ష కేంద్రంలో దిగారు. ఇది ఎనిమిది రోజుల మిషన్ అయినప్పటికీ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం లీకేజి, సాంకేతిక సమస్యల కారణంగా తిరుగు ప్రయాణం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిని తిరిగి భూమికి తీసుకురానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News