Monday, March 27, 2023

సైబరాబాద్‌లో గ్రీవెన్స్ సెల్

- Advertisement -

Joint Commissioner holds grievance cell review

నిర్వహించిన జాయింట్ సిపి అవినాష్ మహంతి

హైదరాబాద్: గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రీవెన్స్ సెల్ సమావేశాన్ని బుధవారం కమిషనరేట్‌లో నిర్వహించారు. సమావేశంలో హెచ్‌ఆర్‌ఎంఎస్, సినీమాటోగ్రఫీ అనుమతులు, ఈవెంట్ అనుమతులు, పెట్రోలియం అనుమతులు తదితరాలపై చర్చించారు. సిఎఓ సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యల గురించి చెప్పాలని జాయింట్ సిపి అవినాష్ మహంతి అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. సమావేశలో డిసిపి అనసూయ, డిసిపి క్రైం కవిత, ఎసిపిలు, ఛీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళా, ఛీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, సూపరింటెండెంట్లు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News