Tuesday, April 23, 2024

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
సిఎం రేవంత్‌రెడ్డికి టిడబ్లూజేఎఫ్ విజ్ఞప్తి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య, కార్యదర్శులు ఎన్కె. సలీమ, బి. జగదీశ్వర్, ఈ చంద్రశేఖర్ తదితరులు సిఎంను కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. అన్ని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల్లో పనిచేసేలా కొత్త హెల్త్ కార్డుల విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అక్రిడిటేషన్ కార్డులను చూపిస్తే సచివాలయంలోకి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీలో అన్ని పత్రికల సంపాదకులను నియమించాలనీ, అలాగే జీవో 239 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యూనియన్లను మీడియా అకాడమీ సభ్యత్వం కల్పించాలని సిఎం దృష్టికి తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు, చిన్న, మధ్య తరహా పత్రికల సమస్యలను పరిష్కారించాలని సూచించారు ఇందుకు స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత జర్నలిస్టుల సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News