Thursday, April 18, 2024

హిండెన్‌బర్గ్ నివేదికపై జెపిసి దర్యాప్తు: ప్రతిపక్షాల డిమాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీలపై వెలువడిన హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాలు గురువారం ప్రభుత్వాన్ని డిమాండు చేశాయి. అదానీ గ్రూపు అక్రమాలకు, అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపక్షాలు కోరాయి. పార్లమెంట్‌లో అనుసరించవలసిన వ్యూహాన్ని చర్చించేందుకు భావసారూప్యతగల ప్రతిపక్షాలు గురువారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశమయ్యాయి. ఈ అంశంపై సభ చర్చించాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష ఎంపిలు సంబంధిత సభలకు నోటీసులు ఇచ్చాయి.

అయితే ఉభయ సబలు ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.ఇలా ఉండగా..ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ మోసాలు, అబద్ధాలతో గౌతమ్ అదానీ నిర్మించిన సౌధాలు పేకమేడల్లా కూలిపోతున్నాయని ఆరోపించారు. దేశంలోని కోట్లాదిమంది పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని, అదానీ కంపెనీలకు వేల కోట్లలో రుణాలిచ్చిన ఎల్‌ఐసి, ఎస్‌బిఐ పరిస్థితే ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సభనుద్దేశించి వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఆర్‌బిఐ, ఇడి, సిబిఐ ఏం చేయకుండా ఎందుకు ఉన్నాయో ఆర్థిక మంత్రి చెప్పాలని, ఎఫ్‌పిఓ కేవలం ఆరంభమేనని, అదానీ అసత్యాల గుట్టలు కూలిపోవడం తథ్యమని సంజయ్ సింగ్ అన్నారు. అదానీ పాస్‌పోర్టును జప్తు చేసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News